
పాఠశాలలో ఏఎంవో తనిఖీ
డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలను జిల్లా ఏఎంవో కె.భాస్కర్‌రావు గురువారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రాథమిక విద్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మండలంలోని ప్రతి పాఠశాలను సందర్శించి విద్యా బోధనతో పాటు ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీయాలని ఎంఈవో శెట్టి సుందర్‌రావుకు ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్న భవిత సెంటర్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఈవో–2 బి.బి. నాగేశ్వరరావు, ఐఈఆర్‌టీ కిరణ్, సీఆర్‌పీలు, ఎంఐఎస్‌లు పాల్గొన్నారు.