
సెల్‌టవర్ ఏర్పాటుకు వినతి
గంగవరం: గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ నెట్ వర్క్ సిగ్నల్ సమ స్య పరిష్కరించాల ని కోరుతూ ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కమిటీ అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు రాజమండ్రిలోని బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం రాజును కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. మండలంలోని పిడతమామిడి పరిసర గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ నెట్‌వర్క్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దీనిపై ఆయన స్పందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు.