
అవార్డు గ్రహీతలకు అభినందనలు
గంగవరం: మండలంలో నీతి ఆయోగ కార్యక్రమాల విజయవంతంగా నిర్వహించడంలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ దినేష్‌కుమార్ అవార్డులు అందజేశారు. ఆయా ఉద్యోగులను పలువురు అభినందనలు తెలిపారు. నీతి ఆయోగ కార్యక్రమాలు విసృత్తంగా అమలకు కృషి చేసిన
ఎంపీడీవో వై.లక్ష్మణరావు, నీతి ఆయోగ మండల ప్రతినిధి హేమమాధురితో పాటు ఎఎన్‌ఎంలు తాము అనూష, అంగన్‌వాడీ వర్కర్ సుజాత, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ గ్రేస్, వెలుగు శాఖకు చెందిన నాగమణి తదితరులు అవార్డులు అందుకున్నారు. వారికి తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బేబిరత్నం, వైస్ ఎంపీపీ గంగాదేవి, రామలక్ష్మి, మాజీ ఎంపిపి తీగల ప్రభ, సర్పంచ్‌లు అక్కమ్మ, వైఎస్సార్‌సీపీ మండలఅధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.
వై.రామవరం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ఎంపీడీఓ కె బాపన్నదొరకు పాడేరులో ్లకలెక్టర్ దినేష్‌కుమార్ చేతుల మీదుగా ఉత్తమ సేవ ఆవార్డును అందుకున్నారు. నీతి ఆయోగ్ సర్వేలో మెరుగైన సేవలు అందించిన కారణంగా ఎంపీడీవోతోపాటు, సర్వే బృందానికి ఈ ఆవార్డులు అందజేశారు.

అవార్డు గ్రహీతలకు అభినందనలు