
అదనంగా అంబులెన్స్‌ను కేటాయించాలి
ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్‌సీలో అదనంగా 108 అంబులెన్స్ కేటాయించాలని సీపీఎం మండల కార్యదర్శి కె.త్రినాథ్ డిమాండ్ చేశారు. సీహెచ్‌సీని వారు గురువారం సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం పంచాయతీ సంగంవలస గ్రామానికి చెందిన గురుమూర్తి(50) అనే గిరిజనుడు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో ఉదయం 10.30 గంటలకు ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3గంటలకు వాహనం రావడంతో ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఒక అంబులెన్స్‌తో మండలవాసులు ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి మరో 108 కేటాయించాలని కోరారు. లక్ష్మీపురం ఉపసర్పంచ్ సత్యం, నాయకుడు గాసిరాం దొర పాల్గొన్నారు.