
రోడ్డు కోసం వినూత్న నిరసన
డుంబ్రిగుడ: కొర్రాయి పంచాయతీ గత్తరజిల్లెడ గ్రామానికి వెళ్లే రహదారిలోని బురదలో స్థానిక యువకులు వరి నారును నాటారు. కొన్నేళ్లుగా ఈ రహదారి అధ్వానంగా ఉందని, పలుమార్లు అధికారులకు విన్న వించినా పట్టించుకోవడం లేదన్నారు. రాకపోకల కు నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారులు ఏర్పాటుచేస్తామని ప్రగల్భాలు పలికిన ఉప ముఖ్యమంత్రి అధ్వానంగా ఉన్న రోడ్ల గురించి కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బురద దారిపై స్థానిక యువత గురువారం నాట్లు వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.