
సక్రమంగా రేషన్ అందేలా చర్యలు
పెదబయలు: పెదబయలు డీఆర్ డిపో పరిధిలో ప్రతీ కార్డుదారుడికి రేషన్ సరకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నట్టు పాడేరు సివిల్ సప్‌లై డీప్యూటీ తహసీల్దార్ కె.అప్పలస్వామి అన్నారు. కార్డుదారులకు బియ్యం, రేషన్ అందలేదని పలు పార్టీల నాయకులు, లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో ఆయన గురువారం డిపోను తనిఖీ చేశారు. ఈ పాస్ మిషన్ సాంకేతిక లోపం కారణంగా జాప్యం జరిగిందని, డిపోల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు. కార్డుదారులకు బియ్యం అందించాలని సేల్స్‌మన్‌కు ఆదేశించామన్నారు. రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సెల్స్‌మాన్లను కోరారు. మేనేజన్ అప్పన్న. జీసీసీ సిబ్బంది ఉన్నారు.