
జిల్లాకు రూ.27 కోట్ల నీతి ఆయోగ్ నిధులు
సాక్షి,పాడేరు: జిల్లాలో రైతుల ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నామని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు.స్థానిక కాఫీ హౌస్‌లో రైతు ఉత్పత్తుల ఆకాంక్ష హాట్ ఎగ్జిబిషన్‌ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ సమారో కార్యక్రమాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని,గంగవరం,మారేడుమిల్లి,వై.రామవరం మండలాల్లో అమలుజేస్తున్నామన్నారు. జిల్లాకు రూ.27కోట్ల నీతి ఆయోగ్ నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.గిరిజన రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు పంపిణీ చేయడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిచవచ్చని తెలిపారు. మారేడుమిల్లి,గంగవరం,వై.రామవరం మండలాల్లో అభివృద్ధిపై విద్యా,వైద్యశాఖలతో పాటు ఐసీడీఎస్,డీఆర్‌డీఏ అధికారులు,ఎంపీడీవోలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.అనంతరం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశిత సూచికలను విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేసిన డీఈవో పి.బ్రహ్మాజీరావు,జిల్లా వ్యవసాయాధికారి నందు,డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు,డీఆర్‌డీఏ పీడీ మురళీ,ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, గంగవరం, మారేడుమిల్లి, వై.రామవరం మండలాల ఎంపీడీవోలు,పలుశాఖల ఉద్యోగులకు కలెక్టర్ దినేష్‌కుమార్,జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.