
నాణ్యమైన విద్య అందేలా చర్యలు
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
హుకుంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. బుధవారం స్థానిక విదాశాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించి, మండలంలో పాఠశాలల వివరాలు తెలుసుకున్నారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ మండలంలోని మారుమూల గ్రామాల్లో సైతం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూడా రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.