
చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతు
● ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు
గంగవరం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు ఉపాధ్యాయులకు సూచించారు. నెల్లిపూడి జెడ్పీ పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఉపాధ్యాయులు డైరీలు, లెసెన్‌ప్లాన్ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.