
సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు
పెదబయలు: మండలంలో పాఠశాలలు తెరిచి రెండు నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయులను భర్తీ చేయడం లేదని దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని మండలంలోని ఎంపిటీసీ సభ్యులు, సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొండా వరహాలమ్మ అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీడీవో పూర్ణయ్య సభాధ్యక్షుడిగా వ్యవహారించారు. పలు శాఖలపై అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పెదబయలు మండలంలోని ఇంజరి. గిన్నెలకోట, జామిగుడ, బొంగరం పంచాయతీల పరిధిలోని పాఠశాలకు ఉపాధ్యాయులు లేదని, జూన్ 12న పాఠశాలలు తెరిచిన నేటి వరకు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేదని దీంతో చిన్నారులకు విద్యకు దూరమవుతున్నారని ఉపాధ్యాయులకు భర్తీ చేసి పాఠశాలలు తెరువాలని సభ్యులు ధ్వజమెత్తారు. ఈ నెల 16 మంది ఉపాధ్యాయులను పాఠశాలలు తెరువాలని డిప్యూటేషన్ ఆదేశాల జారీ చేసినా పాఠశాలలు తెరువాలేదన్నారు. గిరిజన విద్యపై కూటమి ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైబడినా మండలంలోని ఎక్కడా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదని సీతగుంట ఎంపీటీసీ సభ్యుడు కిమంకరి బొంజుబాబు, సర్పంచ్ పలాసి మాధవరావు చెప్పారు. ఉపాధి పథకం ద్వారా పంపిణీ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి తీసుకొచ్చిన సిల్వర్ ఓక్ ఇతరత్రా మొక్కలు ఎండిపోతున్నాయని, మండలంలోనే నర్సరీలు ఏర్పాటుచేసి గిరిజన రైతులను ఆదుకోవాలన్నారు.మండలంలో చాలా మందికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం సుమారు 2200 మందికి మంజూరు కాలేదన్నారు. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. రాజ్‌మా విత్తనాలు సకాలంలో అందించాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జీవాలకు వ్యాధులు ప్రబలే అవకాశముందని చెప్పారు. ఈ కారణంగా గ్రామల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించాలని పలువురు సర్పంచ్‌లు కోరారు. డీఆర్ డిపో ద్వారా సరకులు సక్రమంగా పంపిణీ జరగడం లేదన్నారు. యంత్రాంగం స్పందించి రేషన్ సరకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పలు శాఖల ప్రగతిపై సమీక్షించారు.అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. బంగారుమెట్ట నుంచి సంపంగిపుట్టు వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనులు చేయాలని అధికారులను కోరారు. వైస్ ఎంపీపీ సోనే రాజుబాబు, తహసీల్దార్ త్రినాథరావునాయుడు,మండల స్థాయి అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు
పాల్గొన్నారు.
వాడీవేడిగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు

సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు