
ట్రాఫిక్ రూల్స్‌తో ప్రమాదాల నివారణ
వాహనాదారులకు ఆర్టీవో సూచన
గంగవరం: రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే వాహనదారులు పక్కాగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రోడ్డు రవాణా శాఖాధికారి రాజేష్ అన్నారు. మంగళవారం స్థానిక వై.జంక్షన్‌లో ఎస్సై బి.వెంకటేష్‌తో కలసి వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించి ఏ రికార్డు లేకపోయినా కేసులు రాసి జరినామా వసూలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తరచూ నిర్వహిస్తామన్నారు.