
హుకుంపేట వైస్ ఎంపీపీగా సుశీల
హుకుంపేట: హుకుంపేట మండల పరిషత్తు ఉపా ధ్యక్ష ఉపఎన్నికల్లో సంతారి ఎంపీటీసీ సభ్యురాలు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుశీల విజయం సాధించా రు. ఇక్కడ వైస్ ఎంపీపీగా ఉన్న ఒంటుబు ప్రియాంక వ్యక్తి గత కారణాల వల్ల ఇటీవల పదవికి రాజీనామా చేయడంతో బుధవారం ఉప ఎన్నిక నిర్వహించారు. మండలంలోని మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 10 ఓట్లతో బీజేపీ అభ్యర్థి బాలకృష్ణపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుశీల విజయం సాధించారు. ఎన్నికల అధికారి కె.పి.చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని ఆమెకు అందజేశారు.
వైస్ ఎంపీపీకి అభినందనలు
నూతనంగా ఎన్నికై న వైస్ ఎంపీపీ సుశీలకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,ఎంపీపీ కూడా రాజుబాబు, ఇతర నాయకులతో కలిసి పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,ఏవో సన్యాసిరావు,వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి అనిల్,పార్టీ గౌరవ అధ్యక్షుడు గండేరు చినసత్యం,స్థానిక సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

హుకుంపేట వైస్ ఎంపీపీగా సుశీల