
మధుర ఫలాలు.. చేదు ఫలితాలు
సాక్షి, పాడేరు: మన్యంలో గిరిజన రైతులు సాగు చేస్తున్న ఆర్గానిక్ మధుర ఫలాలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. ఇక్కడ పండే పైనాపిల్, పనస, సీతాఫలాలకు మైదాన ప్రాంతాల్లో ఎంతో డిమాండ్ ఉంది. నాణ్యత, రుచిలో నంబర్ 1గా ఆదరణ ఉన్నప్పటికీ ఈ మధుర ఫలాలకు మాత్రం సీజన్ ప్రారంభం నుంచి ఆశించినంత ధరలు లేకపోవడంతో గిరిజన రైతులు నష్టపోయారు. ప్రస్తుతం పైనాపిల్, పనస పండ్ల సీజన్ చివరి దశలో ఉంది. మైదాన ప్రాంతాలలో డిమాండ్ తగ్గడంతో విజయవాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన పెద్ద వ్యాపారులు కూడా గత 2 వారాల నుంచి ఏజెన్సీకి రావడం లేదు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన దళారీ వ్యాపారుల మాటే వేదంలా చలామణీ అవుతోంది. డుంబ్రిగుడ, జి.మాడుగుల, పాడేరు మండలాల్లో 700 ఎకరాల్లో పైనాపిల్ తోటలను గిరి రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వంట్లమామిడి, అరకు, చిట్రాలగుప్ప ప్రాంతాలలో ఒక పండు రూ.10 నుంచి రూ.12 ధరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ.10కి మించి పైనాపిల్ అమ్ముడుపోకపోవడంతో గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు.
దక్కని గిట్టుబాటు ధర సీజన్ చివరిలోనూ పెరగని ధరలు
పైనాపిల్, పనస పండ్లకు తగ్గిన గిరాకీ
సీతాఫలాల ధరలు పతనం
వర్షాలతో ముందుకురాని మైదాన ప్రాంత వ్యాపారులు
నష్టపోతున్న గిరిజన రైతులు

మధుర ఫలాలు.. చేదు ఫలితాలు

మధుర ఫలాలు.. చేదు ఫలితాలు