
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, పాడేరు: తలారిసింగి క్రీడా మైదానంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ గురువారం మైదానాన్ని సందర్శించారు. అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారని చెప్పారు. అన్ని శాఖల శకటాల ప్రదర్శనతోపాటు, పోలీసులు, విద్యార్థుల మార్చ్‌పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పథఽకాల ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం