
ఎన్నాళ్లీ నడకయాతన!
ముంచంగిపుట్టు: మండలంలోని దొరగూడ గ్రామ గిరిజనులు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మంజూరైనా పనులు జరగకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షకాలంలో వారి అవస్థలు వర్ణనాతీతం. ఉధృతంగా ప్రవాహిస్తున్న వాగులు దాటితే గాని నిత్యావసర సరుకులు పొందలేని పరిస్థితి వారిది. సరుకుల కోసం బుధవారం పలువురు గ్రామస్తులు ఆరు కిలో మీటర్లు కాలినడకన కొండ ఎక్కి దిగి,అటవీ ప్రాంతాల్లో ప్రయాణించి,ఉధృతంగా ప్రవహిస్తున్న బిరిగూడ,ఉబ్బెంగుల వాగులు దాటుకుని లక్ష్మీపురం పంచా యతీ కేంద్రానికి వెళ్లవలసి వచ్చింది. రేషన్ డిపోలో సరుకులు పొందడంతో పాటు ఇంటికి కావాల్సిన సరుకులను సంతలో కొనుక్కుని తిరిగి అవే కష్టాలు పడుతూ గ్రామానికి చేరుకున్నారు. రహదారి పూర్తి చేసి,కల్వర్టులు నిర్మించి కష్టాలు తీర్చాలని వారు వేడుకుంటున్నారు.