
ఆదర్శ గ్రామంగా గొందిపాకలు
చింతపల్లి: స్వాతంత్య్ర సమరయోధులు జన్మించిన గొందిపాకులు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. గొందిపాకలులో తొలిసారిగా అధికారికంగా బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర సమరమోధుడు బోనంగి పండుపడాల్ 135 జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పండుపడల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి పొందుతున్న ఈ ప్రాంతంలో హోం స్టేలు ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి అన్నివిధాలుగా ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఎర్రవరం జలపాతాన్ని అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ సందర్భంగా గ్రామంలో పలువురు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వివరాలను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం గ్రామంలో పండుపడాల్ కుటుంబ సభ్యలను దుశ్శాలువాలతో సన్మానించారు.గ్రామంలో కొంతసేపు పర్యటించి అవకాడో మొక్కలను పరిశీలించి, పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. గిరిజన రైతులు పండించి, సేకరించిన వ్యవసాయ,ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర, ఎంపీపీ కోరాబు అనూషదేవి,ఎంపీడీవో సీతామహాలక్ష్మి,ఎంఈవో ప్రసాద్, డీఈ రఘు, ఏవో మధుసూదన్‌రావు.ఎంపీటీసీ మోహనరావు, స్వాతంత్య్ర సమరయోధుడు పండు పడాల్ కుటుంబ సభ్యులు కుశలవుడు,కనకారావు,రామారావు,వెంకటేశ్వర్లు,గంగరాజు,అబ్బాయినాయుడు తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి
సాక్షి,పాడేరు: యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు.ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు రెండు వారాల పాటు ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలన్నారు.పరిసరాలు,నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతని చెప్పారు. అనంతరం ర్యాలీ పాడేరు వీధుల్లో సాగింది.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్‌గౌడ,సహాయ కలెక్టర్ కె.సాహిత్,డీఈవో బ్రహ్మాజీరావు,జిల్లా వ్యవసాయాధికారి నందు,డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, డీఆర్‌డీఏ పీడీ మురళీ,ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి తదితరులు పాల్గొన్నారు.
మ్యూజియం ఏర్పాటుకు చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్

ఆదర్శ గ్రామంగా గొందిపాకలు