రాజవొమ్మంగి: రాజవొమ్మంగి శివారు ఎస్సీ కాలనీలో వాలీబాల్ ఆడుతున్న బోడపాటి విశాల్‌ను సోమవారం సాయంకాలం పాము కాటు వేసింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన రాజవొమ్మంగి పీహెచ్‌సీకు తరలించగా స్టాఫ్‌నర్స్ భవాని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. విశాల్ రాజవొమ్మంగి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి వచ్చిన తరువాత సహచర పిల్లలతో ఆటలాడుతుండగా ఈ సంఘటన జరిగింది. తనను కరచిన పాము గోదుమ రంగులో ఉన్నట్టు విశాల్ చెప్పాడు.