
వారియర్స్‌పై రాయల్స్ విజయం
విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ20లో భాగంగా సోమవారం జరిగిన తొలిమ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌పై అమరావతి రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. కెప్టెన్ మహీప్ కుమార్(28), ప్రశాంత్(59), ఆనంద్(32), శశికాంత్(36) బ్యాటింగ్‌లో రాణించారు. కార్తీక్, మల్లికార్జున రెండేసి వికెట్లు తీయగా అయ్యప్ప, వినయ్ చెరో వికెట్ తీశారు. రాయల్స్ కెప్టెన్ హనుమవిహారీ(9) తక్కువ స్కోర్‌కే వెనుదిరగ్గా.. రాహుల్(61) సందీప్ (33), ప్రసాద్ (42 నాటౌట్), పాండురంగ(39 నాటౌట్) రాణించారు. శశికాంత్ రెండు వికెట్లు తీయగా స్టీఫెన్, తోషిత్, సౌరబ్ ఒక్కో వికెట్ తీశారు.

వారియర్స్‌పై రాయల్స్ విజయం