
సారూ.. పట్టించుకోరూ!
● నిరుపయోగంగా ప్రభుత్వ భనవాలు ● దెబ్బతింటున్న కార్యాలయాలు ● ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని వైనం ● అధికారుల నిర్లక్ష్యం
రంపచోడవరం: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన సొమ్ములు వృథా చేస్తున్నారు. రంపచోడవరంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చేపటి ్టన భవన నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారు. ఆ భవన నిర్మాణ పనులు పూర్తి చేయకుండా వదిపెట్టడంతో ఎవరికి ఉపయోగపడకుండా ఉండిపోయాయి. ప్రస్తుతం నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా రంపచోడవరం పాల కేంద్రం వద్ద నిర్మించిన భవన పూర్తి కాలేదు. అలాగే పీఎంఆర్‌సీని ఆనుకుని సిరిగిందలపాడు వెళ్లే దారిలో జీడిపిక్కల యూనిట్ ఏర్పాటు నిర్మించిన భవనం పూర్తి కాలేదు. భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద కొండపై నిర్మించిన అధికారుల అతిథి గృహం పనులు ఏళ్లు కావస్తున్నా పూర్తి కాలేదు. ఏళ్లు గడుస్తున్నా భవనాల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆయా భవనాలను త్వరితగతిన నిర్మించి, వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

సారూ.. పట్టించుకోరూ!

సారూ.. పట్టించుకోరూ!

సారూ.. పట్టించుకోరూ!