
సారా బట్టీలపై దాడులు
అడ్డతీగల: రంపచోడవరం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గల వివిధ పాత నేరాల్లో కేసుల్లో పాత నేరస్తులను స్పెషల్ డ్రైవ్ ద్వారా అరెస్టు చేసి రంపచోడవరం కోర్టు నందు హాజరు పరిచి రిమాండ్ కు పంపించినట్టు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. అడ్డతీగల మండలం వీరవరం గ్రామంలో సోమవారం జరిపిన ఆకస్మిక దాడుల్లో 50 లీటర్ల సారాను స్వాధీన పరుచుకుని, 1400 లీటర్ల బెల్లపు పులుపును ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. సారా తయారికి వినియోగించే ముడి సరుకు బెల్లాన్ని సంతలు ద్వారా సరఫరా చేస్తున్న ఏలేశ్వరం మండలానికి చెందిన ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ దాడుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ పైడేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ నాయుడు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.