
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
సీలేరు: సీలేరు పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనం బోల్తా పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దుప్పులవాడ పంచాయతీ గొందిపాలెం గ్రామానికి చెందిన బురిడీ జయ సోమవారం 48 సీలేరు బైక్ పై వస్తుండగా ప్రమాదవశాత్తు పడి తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోల్ సిబ్బంది ఫీడర్ అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే టెక్నీషియన్ వెంకటేష్ స్పందించి సీలేరు పీహెచ్‌సీకి డాక్టర్ మస్తాన్ వైద్యం అందించి చింతపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించారు
గూడెంకొత్తవీధి: మండలంలోని కడుగుల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో దామణాపల్లి పంచాయతీ సిగ్నపల్లి రాం నగర్ కాలనీకి చెందిన కాకరి దారబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.తక్షణమే అతడిని ఆస్పత్రికి తరలించారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు