
రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారం
● అదే నా తొలి ప్రాధాన్యం
● నిత్యావసరాల సరఫరాపై ప్రత్యేక దృష్టి
● రంపచోడవరం నూతన సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్
రంపచోడవరం: నూతన సబ్ కలెక్టర్‌గా శుభమ్ నొఖ్వాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2023 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందినవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో రెవెన్యూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందే విధంగా కృషి చేస్తానన్నారు. నిత్యావసరాలను సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. తాను ఇదివరకు ఎన్టీఆర్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేసినట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన సబ్ కలెక్టర్‌ను డీటీలు సరిత, శివ, త్రిమూర్తులు, సీహెచ్ చంటి, ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.