
మోసపూరిత హామీలతో చంద్రబాబు అరాచక పాలన
అడ్డతీగల: అబద్ధపు హామీలిచ్చి మోసంతో గద్దెనెక్కి ప్రజలని నిలువునా చంద్రబాబు ముంచారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. మండలంలోని ఎల్లవరంలో ఆదివారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల నుంచి భారీగా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగనన్న పేదవాడి సంక్షేమం కోసం పరితపించి అనేక పఽథకాలు అమలుచేశారని గుర్తు చేశారు.అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పేదవాడి ఉసురు తీస్తోందన్నారు. నవరత్న పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నీతి నిబద్దత ముందు మోసాలకే గురువుగా మారిన చంద్రబాబు ప్రజలను వంచించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. భవిష్యత్‌లో ప్రజాహితమైన వైఎస్సార్‌సీపీనే గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
జీవో నెంబర్–3 కనిపించకుండా చేసింది
చంద్రబాబే: ఎంపీ తనూజారాణి
గిరిజనులకు ఎంతో ప్రయోజనకరమైన జీవో నెంబర్–3ని కనిపించకుండా చేసింది చంద్రబాబేనని అరకు ఎంపీ తనూజారాణి అన్నారు. 48 వేల ఎకరాలు కొండపోడు భూములకు గిరిజనులకు హక్కుపత్రాలను ఇచ్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు.విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అనేక మౌలిక వసతులు కల్పించారన్నారు. 2 లక్షల 76 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపేణా పేదలకు అందించారన్నారు.
సూపర్‌సిక్స్ పేరుతో అరచేతిలో వైకుంఠం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా సూపర్‌సిక్స్ పేరిట అరచేతిలో వైకుంఠం చూపిన ఘనత మోసాల చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. నవరత్నాల పథకాలను ప్రకటించి అన్ని వర్గాలకు వాటి ద్వారా మేలు చేసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రజల పట్ల తన నిబద్దను చాటుకుంటే సూపర్‌సిక్స్ అంటూ చెప్పి నేడు పి–4 అంటూ మరో మోసానికి తెరతీసారన్నారు. నాయకులపై దాడులు చేస్తూ తప్పుడు కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందడం మినహా సాధించింది శూన్యం అన్నారు.
ప్రజాపాలనలో కూటమి ప్రభుత్వం విఫలం:
మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
పరిపాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. హామీలిచ్చి అమలు చేయలేక నోటికొచ్చిన మాటలను కూటమి నేతలు చెబుతున్నారన్నారు. జగనన్న రోడ్డెక్కితే తల్లిక వందనం అమలుచేశారన్నారు. అది కూడా పూర్తిస్ధాయిలో చేయలేకపోయారన్నారు. స్ధానిక ఎమ్మెల్యే ప్రజలకు మేలు చేయడం మాని విచ్చలవిడి అవినీతిలో మాత్రం అందవేసిన చేయిగా మారారన్నారు.
ప్రజా సంక్షేమం అమలుకు వైఎస్సార్‌సీపీని
గెలిపించుకోవాలి: అరకు పార్లమెంట్ పరిశీలకులు
బొడ్డేటి ప్రసాద్
ప్రజాసంక్షేమం అమలు కావాలంటే వైఎస్సార్‌సీపీనే గెలిపించుకోవాలని అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేటి ప్రసాద్ అన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి పేదల జీవితాల్లో వెలుగులను నింపారన్నార . చంద్రబాబు మోసపు వాగ్ధానాలు వివరిస్తూ ఉన్న క్యూర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్లవరంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ
భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కూటమి ప్రభుత్వ పాలనపై అరకు ఎంపీ తనూజారాణి, పార్టీ యవజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అరకు పార్లమొంట్ పరిశీలకులు
బొడ్డేటి ప్రసాద్ తదితరుల ధ్వజం

మోసపూరిత హామీలతో చంద్రబాబు అరాచక పాలన

మోసపూరిత హామీలతో చంద్రబాబు అరాచక పాలన

మోసపూరిత హామీలతో చంద్రబాబు అరాచక పాలన