
యువకుడిని కాపాడిన లైఫ్‌గార్డ్స్
కొమ్మాది: రుషికొండ బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న ఓ యువకుడిని లైఫ్‌గార్డ్స్ రక్షించారు. గోపాలపట్నానికి చెందిన సంతోష్, హేమంత్, గణేష్, లోకేష్ అనే నలుగురు యువకులు ఆదివారం మధ్యాహ్నం సరదాగా గడపడానికి బీచ్‌కు వచ్చారు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా, అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిలో ఒకరైన లోకేష్ కొట్టుకుపోయాడు. అది గమనించిన లైఫ్‌గార్డ్స్ ఎస్.నూకరాజు, ఎం.అమ్మోరు, గురుమూర్తి, చిన్నప్పన్న, వెంకటేష్, దేవ వెంటనే స్పందించి ఆ యువకుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మైరెన్ పోలీసులు యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. పర్యాటకుడి ప్రాణాలు కాపాడిన లైఫ్‌గార్డ్స్‌ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు.
యారాడ తీరంలో..
పెదగంట్యాడ: యారాడ తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకుడు సముద్రంలో దిగి కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న బీచ్ లైఫ్ గార్డ్స్ రక్షించారు. వివరాలివి. గంగవరానికి చెందిన యవకులు ఆదివారం యారాడ తీరానికి వెళ్లారు. కాసేపు ఇసుక తిన్నెల్లో గడిపిన యువకులు స్నానానికి సముద్రంలో దిగారు. ఒక్కసారిగా అలల తాకిడి పెరగడంతో గరికిన మహేష్(30) సముద్రంలోకి కొట్టుపోతుండగా, అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ కదిరి లోవేష్‌కుమార్, కదిరి వెంకటేష్, శ్రీనివాస్, కె.వెంకటేష్ గమనించారు. వెంటనే వారు సముద్రంలోకి దిగి, కొట్టుకుపోతున్న మహేష్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది.

యువకుడిని కాపాడిన లైఫ్‌గార్డ్స్