
పలు రైళ్ల రద్దు, మరికొన్ని గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం (విశాఖ): వాల్తేర్ డివిజన్ పరిధి పార్వతీపురం–సీతానగరం– బొబ్బిలి–డొంకినవలస సెక్షన్‌ల్లో జరుగుతున్న మూడో లైన్ సంబంధిత భద్రతా పనుల నిమ్తితం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు.
రద్దయిన రైళ్లు
విశాఖపట్నం–రాయ్‌పూర్(58528) పాసింజర్ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు, రాయ్‌పూర్–విశాఖపట్నం(58527) పాసింజర్ ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు, విశాఖపట్నం–కోరాపుట్(58537) పాసింజర్ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు, కోరాపుట్–విశాఖపట్నం(58537) పాసింజర్ ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు, విశాఖపట్నం–భవానిపట్న(58504) పాసింజర్ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు, భవానిపట్న–విశాఖపట్నం(58503) పాసింజర్ ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు రద్దయ్యాయి.
గమ్యం కుదించిన రైళ్లు
ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు గుంటూరు–రాయగడ (17243) ఎక్స్‌ప్రెస్ విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు రాయగడ–గుంటూరు(17244) ఎక్స్‌ప్రెస్ రాయగడ నుంచి కాకుండా విజయనగరం నుంచి బయల్దేరుతుంది.
సమయం మార్చిన రైళ్లు
●దుర్గ్‌లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన దుర్గ్–విశాఖపట్నం (20829) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 8.45 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే తేదీల్లో విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.50గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం–దుర్గ్ (20830) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 2.30 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.20 గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది.
●ఈ నెల 24, 26వ తేదీల్లో నాందేడ్‌లో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరాల్సిన నాందేడ్–సంబల్‌పూర్(20810) నాగావళి ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు బయల్దేరుతుంది.
●ఈ నెల 20, 21, 23, 24, 26వ తేదీల్లో విశాఖపట్నంలో ఉదయం 9.20 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం–నిజాముద్దీన్(12807) సమతా ఎక్స్‌ప్రెస్ 5 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరుతుంది.