
సరిలేరు
పొల్లూరు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ముందుచూపు ఫలితం
వచ్చే మార్చి నాటికి పూర్తిచేసేలా శరవేగంగా పనులు
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదిగా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం
గుర్తింపు పొందనుంది. 460
మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం
గల ఈ కేంద్రంలో రెండో దశలో చేపట్టిన రెండు యూనిట్ల నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేసే లక్ష్యంతో ఏపీ
జెన్‌కో అధికారులు వేగవంతం చేశారు. ఇవి పూర్తయితే ఉత్పాదన సామర్థ్యం 690
మెగావాట్లకు పెరగనుంది.
460 మెగావాట్ల నుంచి 690 మెగావాట్ల
ఉత్పాదన లక్ష్యంగా జలవిద్యుత్ కేంద్రం అడుగులు
మోతుగూడెం: లోయర్ సీలేరు కాంప్లెక్స్‌లోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ఆధునికీకరణ పనులు వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేసే లక్ష్యంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు 115 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగు యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు యూనిట్ల నిర్మాణానికి ప్రాజెక్ట్ ప్రారంభం (1977)లోనే గ్రౌండ్ లెవెల్, స్ట్రక్చర్ సివిల్ పనులు పూర్తి చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
రూ.536 కోట్ల్ల కేటాయింపు
రాష్ట్ర విభజన తరువాత డిమాండ్‌కు తగినంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో అధిక ధరలకు ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుచూపుతో ఇదే ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెంచే లక్ష్యంతో ప్రణాళికపరంగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అదనంగా అదే సామర్థ్యంతో 5,6 యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకు రూ.536 కోట్లు వెచ్చించింది. రెండేళ్ల క్రితమే టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖల నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. దీనిపై ప్రత్యేకదృష్టి సారించిన గత ప్రభుత్వం నిర్మాణ పనులను వేగవంతం చేసింది. రెండు యూనిట్లకు సంబంధించి ఇప్పటివరకు సివిల్, పెన్‌స్టాక్ పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి.
● ఐదో యూనిట్‌కు సంబంధించి సివిల్ పనులు ఫ్లోర్ శ్లాబ్ వరకు జరిగాయి. కీలకమైన స్పారల్ కేసింగ్, స్టీరింగ్ ఎరెక్షన్ పనులు పూర్తయినట్టు జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి.
● ఆరో యూనిట్‌కు సంబంధించి సివిల్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వాల్వు హౌస్ నుంచి టెర్మినల్ యాంకర్ వరకు పెన్‌స్టాక్ పైపులైను నిర్మాణం పూర్తయింది. జనరేటర్ అసెంబ్లింగ్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. బీహెచ్‌ఈఎల్ అధికారుల నిరంతర పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
● ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి కీలకమైన విడి భాగాలు కంపెనీ నుంచి పవర్ హౌస్‌కు అనుకున్న సమయానికి వచ్చేలా ఏపీ జెన్‌కో అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వచ్చే మార్చినాటికి పనులు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ బాలకృష్ణ తెలిపారు. పనులకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా జరిగేలా బీహెచ్‌ఈఎల్, పీఎస్ కంపెనీ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం.
పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం: రూ.536 కోట్లు ప్రస్తుత యూనిట్లు: 4 ఉత్పత్తి సామర్థ్యం: 460 మెగావాట్లు నిర్మిస్తున్న యూనిట్లు: 5,6 అదనంగా పెరగనున్న ఉత్పత్తి: 230 మెగావాట్లు
చురుగ్గా జరుగుతున్న ఐదు, ఆరు యూనిట్ల
పెన్‌స్టాక్ పైపులైన్ నిర్మాణ పనులు
మార్చి నాటికి పూర్తి చేస్తాం
పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో రెండో దశలో చేపట్టిన ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు మార్చినాటికి పూర్తికానున్నాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రెండు యూనిట్లు పూర్తయితే 690 మెగావాట్లకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
– సీహెచ్‌వీ రాజారావు, చీఫ్ ఇంజినీర్, లోయర్ సీలేరు జల విద్యుత్ కేంద్రం

సరిలేరు

సరిలేరు