
ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి
కూనవరం: ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, జీవో నంబరు 3 పునరుద్ధరించాలని యూటీఎఫ్ ఆడిట్ కమిటీ జిల్లా సభ్యుడు యు. వెంకటనారాయణ అన్నారు. యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం టేకులబోరు విద్యావనరుల కేంద్రంలో ఆ సంఘ సభ్యురాలు కట్టం కుమారి జెండా ఆవిష్కరించారు. అనంతరం వెంకట నారాయణ మాట్లాడుతూ అరకు సభలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జీవో నంబరు 3కు అనుబంధంగా ఉండే జీవోను అమలు చేసి విద్యారంగాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఏ. నాగేశ్వరరావు, పాయం కన్నారావు, ఎం. ప్రమీల, మహాతి పీ. కుమారి, నాగదుర్గ, రాంబాబు, రాజారావు, వెంకటాచారి, రాధాకుమారి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఆడిట్ కమిటీ జిల్లా సభ్యుడు వెంకటనారాయణ డిమాండ్