
రంపచోడవరంను రాజమహేంద్రవరంలో కలపొద్దు
రాజవొమ్మంగి: రంపచోడవరంను అల్లూరి జిల్లా నుంచి వేరు చేస్తే ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి తప్ప, రాజమహేంద్రవరంలో కలపవద్దని రాజవొమ్మంగి ఎంపీపీ గోము వెంకటలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాజవొమ్మంగిలో ఏర్పాటు చేసిన ఆదివాసీల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతంలోని సంపద ఆదివాసీలకే చెందాలన్నారు. రంపచోడవరంను రాజమహేంద్రవరంలో కలిపితే ఏజెన్సీలోని వనరులు మైదానప్రాంతాలకు తరలిపోతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని ఆమె కోరారు.