
ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమం ఉధృతం
అడ్డతీగల : ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు ఒకటి నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ నిర్వహిస్తున్న ఆదివాసీ నవోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుంజ శ్రీను మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కుల సాధన కోసం విస్తృత ప్రచారం చేస్తోందన్నార. బాబూరావు, నూకరాజు, ప్రసాదు, అరుణకుమారి, చిన్నారెడ్డి, రమణ, సత్తిబాబు, కాసులమ్మ, అరుణ కుమారి తదతరులు పాల్గొన్నారు.