
రహదారులు జలమయం
చింతపల్లి: చింతపల్లి మండలంలో పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై గాలి వాన మొదలైంది. మధ్యాహ్నం రెండు ఒంటి గంటకు మొదలైన వర్షం సాయంత్రం వరకూ కురుస్తూనే ఉంది. వీధులన్నీ జలమలమయ్యాయి. కుమ్మరివీధిలో డ్రైనేజీలు చెత్త చెదారంతో నిండిపోయి వర్షపు నీరు పోవడానికి అవకాశం లేక స్థానిక నివాసాల్లోకి ప్రవహించింది.
లోతట్టు గ్రామాల్లో భారీ వర్షం
రాజవొమ్మంగి: మండలంలోని అమ్మిరేఖల, కిమ్మిలిగెడ్డ, లోదొడ్డి తదితర లోతట్టు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి నాగులకొండ పరీవాహక ప్రాంతంలోని కబర్మతి, పులిగొమ్ము, కిమ్మిలిగెడ్డ చిన్న పెద్ద వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాట్లు వేసేందుకు ఎదురు చూసిన రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేయనున్నారు.

రహదారులు జలమయం

రహదారులు జలమయం