
ఘాట్‌రోడ్డులో ఆర్టీసు బస్సు– లారీ ఢీ
పాడేరు : పాడేరు –చోడవరం ప్రధాన రహదారి ఘాట్‌లోని డైమండ్ పార్క్ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు– లారీ ఢీకొన్న సంఘటనలో పలువురుకి స్వల్ప గాయాలయ్యాయి. మైదాన ప్రాంతం నుంచి పాడేరు వస్తున్న లారీ జోలాపుట్టు నుంచి మధురవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం 8.30గంటలకు ఎదురురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వ్యాన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించి, వైద్యసేవలందించారు. మలుపు వద్ద రెండు వాహనాలు నిలిచిపోవడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సీఎం పర్యటన కోసం తెస్తున్న సామగ్రితో పాటు బందోబస్తు కోసం వస్తున్న పోలీసులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. గంట తర్వాత వాహనాలను పక్కకు తీయడంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.
ప్రయాణికులకు స్వల్పగాయాలు
గంటపాటు ట్రాఫిక్ జాం