
హామీలు ఎగ్గొట్టిన చంద్రబాబు
ఎన్నికల సమయంలో అరకులో ఇచ్చిన హామీలను చంద్రబాబు సీఎం అయ్యాక అమలుచేయకుండా ఎగ్గొట్టారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేస్తామన్న ఆయన వీటిని గాలికొదిలేశారు. హామీలు నెరవేర్చిన తరువాతనే పాడేరు పర్యటనకు రావాలి. లేదంటే ఆయన పర్యటనను గిరిజనులు, ఆదివాసీ, గిరిజన, ప్రజా, విద్యార్థి సంఘాలతో కలిసి అడ్డుకుంటాం.
– మత్య్సరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు