
ఉపాధి కోసం వెళ్లి..
ముంచంగిపుట్టు: ఉపాధి కోసం వెళ్లిన యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. పక్షులను కాల్చే తుపాకీ మిస్ ఫైర్ కావడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కుమడ పంచాయతీ బూరుగుమెట్ట గ్రామానికి చెందిన వంతాల బాలరాజు అనే గిరిజన యువకుడు ఉపాధి నిమిత్తం చేపల చెరువులో పనికి మేస్త్రి బన్నీ అనే వ్యక్తితో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నిర్మలూరు వెళ్లాడు. చెరువులో పక్షులను గన్నుతో కాల్చి, తరిమే పనిలో చేరాడు. అతనికి తుపాకీ కాల్చే అనుభవం లేకపోవడం గురువారం మిస్ ఫైర్ అయింది. దీంతో బాలరాజు శరీరం తీవ్రంగా కాలిపోయింది. దీంతో అతనిని తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో మేస్త్రి చేర్పించి వెళ్లిపోయాడు. అక్కడ చేపల చెరువుల యాజమాన్యం, మేస్త్రి పట్టించుకోకపోవడంతో నరకం చూస్తున్నానని అతను ఫోన్లో స్థానిక విలేకరులకు తెలిపాడు. ఎవరి సహాయం లేక ఇబ్బంది పడుతున్నానని, తనను ఆదుకోవాలని కన్నీటిపర్యంతమవుతూ సెల్ నంబరు (80746 51560) తెలిపాడు.
ప్రమాదానికి గురైన గిరిజన యువకుడు
పక్షులను కాల్చే తుపాకీ మిస్ ఫైర్‌తో తీవ్ర గాయాలు
పశ్చిమగోదావరి జిల్లా నిర్మలూరులో ఘటన
ఆదుకోవాలని మొర