యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

May 22 2025 5:44 AM | Updated on May 22 2025 5:44 AM

యోగాత

యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

పాడేరు: యోగాలో శారీరక భంగిమలు, శ్వాస పద్ధతులు, ధ్యానాన్ని ఏకీకృతం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత భావోద్వేగ సమతుల్యత, ఆధ్యాత్మికత వృద్ధి చెందుతుందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని తలార్‌సింగి ఇండోర్‌ స్టేడియంలో కర్టెన్‌ రైజర్‌ ఈవవెంట అఫ్‌ యోగా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, పలు శాఖల జిల్లా అదికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రక్రియ వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి విద్యపై దృష్టి సారించగలుగుతారన్నారు. విధి నిర్వహణలో ఉన్న వారు ఒత్తిడిని జయించవచ్చన్నారు. నేటి నుంచి నెలరోజుల పాటు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఉత్తమ యోగా సాధకులకు అవార్డులు అందిస్తామన్నారు. ఈసారి అంతర్జాతీయ యోగా డే ప్రధాన వేదికగా విశాఖపట్నం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని చెప్పారు. ప్రపంచ యోగాకు భారత్‌ వేదికగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌బాషా, డీఆర్వో పద్మలత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రతాప్‌, డీఈవో బ్రహ్మాజీరావు, డీపీఆర్వో గోవిందరాజులు, డీఎస్డీఓ జగన్‌మోహన్‌రావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

యోగాతో మంచి ఆరోగ్యం:

చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌

చింతూరు: ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పీవో ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఐటీడీఏ నుంచి గిరిజన

బాలికల ఆశ్రమ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలసి పాఠశాలలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ ఆరోగ్యం ఎంతో ప్రధానమని దీనికోసం ప్రతిరోజూ అరగంట పాటు యోగాకు కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జగన్నాధరావు, ఏటీడబ్ల్యూవో సుజాత, తహసీల్దార్‌ చిరంజీవి, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.

రంపచోడవరం: యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని రంపచోడవరం పీవో కట్టా సింహాచలం అన్నారు. రంపచోడవరంలో బుధవారం ప్రపంచ యెగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపీ ప్రారంభించారు. అంబేడ్కర్‌ సెంటర్‌లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా దినోత్సవం పురస్కరించుకుని గ్రామ, మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్‌వీ రమణ,ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, డీఎల్పీవో పద్మ, ఎంపీడీవో సుండం శ్రీనివాస్‌రావు, తహసీల్దార్‌ పి.రామకృష్ణ, సీడీపీవో సంధ్యారాణి, ఏవో కింటుకూరి లక్ష్మణ్‌, కార్యదర్శి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత 1
1/3

యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత 2
2/3

యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత 3
3/3

యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement