నిబంధనలకు విరుద్ధంగా పీసీ కమిటీ ఎన్నికలు
అడ్డతీగల: మండలంలోని డి.భీమవరంలో పీసా గ్రామకమిటీ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ అధ్యక్షుడు మోడిద నూకరాజు, కార్యదర్శి పీఠ ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు స్ధానిక తహసీల్దార్ సూర్యారావుకు ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పీసా గ్రామసభలో గిరిజనేతరులు కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని అలాగే ఓటు ఉపయోగించుకోవాలన్నారు. కానీ ఓటింగ్ విషయంలో వారు ఒక అభ్యర్థిని నిలబెట్టి వారికి మాత్రమే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి సీక్రెట్ ఓటింగ్ వేయించారని ఆయన వివరించారు. చట్ట ప్రకారం చేతులెత్తే విధానంలో ఎన్నికలు జరగాలన్నారు. దీనికి భిన్నంగా ఎన్నికలు జరగడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధుల ఆరోపణ
తహసీల్దార్‌కు ఫిర్యాదు


