బెల్ట్‌షాపుపై పోలీసుల దాడి
కూనవరం: కూల్‌డ్రింక్ షాపు ముసుగులో బెల్ట్‌షాప్ (మద్యం) నిర్వహిస్తున్న దుకాణంపై పోలీసులు దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని భీమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.ఎస్: లతాశ్రీ అందించిన వివరాల ప్రకారం భీమవరం గ్రామంలో బావినేని ప్రేమ్‌కుమార్ దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం రావడంతో షాపుపై తన సిబ్బందితో దాడి చేశారు. ఈ సందర్భంగా 97–బీర్లు, 180 ఎం.ఎల్.– 40 బ్రాందీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్న బావినేని ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


