
సమస్యల పరిష్కారానికితల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది న
పాడేరు: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో పనిచేస్తు న్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తా మని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందర్‌రావు హెచ్చరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరబిందో సంస్థ ద్వారా వైద్యారోగ్య శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 వాహనాల్లో 500 మంది డ్రైవర్లుగా పనిచేస్తున్నార న్నారు. యాజమాన్యం వీరికి నెలకు కేవలం రూ.8,800 మాత్రమే వేతనంగా చెల్లిస్తోందని చెప్పారు. యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్‌ను కూడా ఉద్యోగుల జీతాల నుంచే మినహాయిస్తున్నా రని తెలిపారు. ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని, వీక్లీ ఆఫ్‌లు, పండగలు, ఇతర దినాల్లో సెలవులు మంజూరు చేయడం లేదని, ఈఎస్‌ఐ సౌకర్యం అమలు చేయడం లేదని చెప్పారు. అదనపు సిబ్బందిని నియమించకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం ఎక్కువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ యూనియన్ సిబ్బంది సింహాచలం, కొండబాబు,విష్ణు,మౌళి,రాజారావు,దుర్గాప్రసాద్, బాలన్న,జయరాం,అనిల్,విజయ్ పాల్గొన్నారు.