రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
సాక్షి,పాడేరు: రహదారి ప్రమాదాలు నియంత్రణే లక్ష్యంగా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు.శుక్రవారం తన కార్యాలయం నుంచి రహదారి భద్రత కమిటీ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు, పాడేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలన్నారు. ఆటోలు, జీపులు,బైక్‌లు రహదారి మార్జిన్‌ల్లో నిలిపివేయడం, వ్యాపారులు చెత్తను రోడ్లపై వేయడం వంటి కారణాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందన్నారు.బైక్ చోదకులంతా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, లేని పక్షంలో జరిమానా విధించాలన్నారు. ప్రతినెలా మొదటి శనివారం పబ్లిక్ కన్వీనయన్స్‌డే నిర్వహించి, రహదారి ఆక్రమణలు, పార్కింగ్ ప్రదేశాలు, హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఘాట్ రోడ్లలో అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అరకు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ కొనుగోలుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, ఎస్పీ అమిత్‌బర్దర్, సబ్‌కలెక్టర్ సౌర్యమన్ పటేల్, జిల్లా రవాణా అధికారి లీలాప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఈ బాల సుందరబాబు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్


