రబ్బరు రైతులకు ఆర్థిక ఆసరా
రంపచోడవరం: ఏజెన్సీలో రబ్బరు సాగు చేస్తున్న రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ అన్నారు. మారేడుమిల్లి మండలం పూజరిపాకల గ్రామంలో రబ్బరు రైతుల తో గురువారం ఆయన సమావేశమయ్యారు. మూ డు సంవత్సరాల్లో 2500 ఎకరాల్లో రబ్బరు ప్లాంటేష న్ వేసే విధంగా ప్రణాళికలు తయారు చేశామన్నారు. మారేడుమిల్లి నుంచి నేషనల్ రబ్బరు ప్రాజెక్టు ఏర్పా టు చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయాలని రబ్బరు రైతులు కోరారు. ఎంత రబ్బరు దిగుబడి వ స్తుంది, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు వంటి విషయాలను తెలుసుకున్నారు. రబ్బరు మొక్కలు ఇచ్చేందుకు నర్సరీ ఏర్పాటు చేయాలని, ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేయాలని రైతులు జానకిరామారెడ్డి, కమలాకర్‌లు కోరారు. ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో 800 ఎకరాల్లో రబ్బరు ప్లాంటేషన్ వేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని, ఇద్దరు హార్టికల్చర్ అఽసిస్టెంట్లను నియమించాలని నాయక్ ఆదేశించారు. ఉపాధి పథకం జాబ్ కార్డు ఆధారంగా ఒక్కో రైతు ఎకరన్నర రబ్బరు ప్లాంటేషన్ వేసుకోవాలన్నారు. పీవో కట్టా సింహాచలం, అధికారులు పాల్గొన్నారు.
ప్రాసెసింగ్ పరికరాల కొనుగోలుకు ఆదేశం
ఏజెన్సీలో వందన్ వికాస కేంద్రాల ద్వారా జీడిపిక్కలు ప్రాసెసింగ్ చేసేందుకు కావాల్సిన పరికరా లు కొనుగోలు చేయాలని ముఖ్య కార్యదర్శి నాయ క్ అధికారులను ఆదేశించారు. కేవీకేలో ఉన్న జీడిపిక్కల యూనిట్‌ను పరిశీలించారు. ఏజెన్సీలో వంద న్ వికాస కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు బ్యాంకు ద్వారా రుణాలు అందజేయాలన్నారు.
టెన్త్‌లో నూరుశాతం ఫలితాలు సాధించాలి
ఏజెన్సీలో వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించాలని ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ అన్నారు. ఐటీడీఏలో పీవోలు కట్టా సింహాచలం, అపూర్వ భరత్, డీఎఫ్‌ఓ రవీంద్రదామలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప దో తరగతి ఉత్తీర్ణతపై ఆరా తీశారు. గిరిజన సంక్షే మ ఇంజినీరింగ్ పనులు ఎన్ని మంజూరయ్యాయి, ఎన్ని పూర్తి చేశారు అనే విషయాన్ని సమీక్షించారు.
2500 ఎకరాల్లో ప్లాంటేషన్
వేసేందుకు ప్రణాళికలు
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ
ముఖ్య కార్యదర్శి నాయక్


