
బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు తరచూ అంతరాయం
ముంచంగిపుట్టు: బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులో మూడు నెలలుగా సక్రమంగా సిగ్నల్స్ ఉండడం లేదు. అధిక శాతం మంది వినియోగదారులు గతం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ నంబర్‌నే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేశారు. సిగ్నల్స్ లేకపోవడంతో బ్యాంకుల సేవల్లో, ఓటీపీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఇంటర్నెట్ పనిచేయక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అధికారులెవరూ ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు. దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక స్థానికులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, చిన్నపాటి వర్షం పడినా సిగ్నిల్స్ పోతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో అందుబాటులో ఉంటూ సిగ్నల్స్ అంతరాయం లేకుండా చూ డాలని మండల వినియోగదారులు కోరుతున్నారు.
మూడు నెలలుగా
వినియోగదారులకు ఇబ్బందులు