
65 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
అడ్డతీగల: మండలంలోని దుప్పులపాలెంలో ఓ ఇంటిలో నిల్వ ఉంచిన 65 బస్తాల (3,372 కిలోలు) ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని బుధవారం పట్టుకున్నట్టు తహసీల్దార్ కొమరం సూర్యారావు తెలిపారు. జీడి పిక్కలు కొనుగోలు చేసే దుప్పలపాలెంకి చెందిన ఒరిస్సై అనే ఓ వ్యాపారి ప్రజల వద్ద నుంచి భారీగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, రవాణాకు సిద్ధం చేసినట్టు సమాచారంరావడంతో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. బియ్యం సీజ్ చేసి, ఆ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. స్వాఽధీనం చేసుకున్న బియ్యాన్ని అడ్డతీగలలోని మండల స్టాక్ పాయింట్‌కి తరలించినట్టు చెప్పారు. పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.