లోయలోకి దూసుకుపోయిన కారు
ముంచంగిపుట్టు: భూసిపుట్టు పంచాయతీ తుడుమురాయి గ్రామ సమీపంలో పర్యాటకుల కారు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. ముగ్గురు పర్యాటకులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు పెదబయలు మండలం తారాబు జలపాతం చూసేందుకు శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. తుడుమురాయి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి కారు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. స్థానికులు హూటహూటిన ప్రమాదానికి గురైన ముగ్గురు యువకులను బయటకు తీశారు. స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనంతరం సంఘటన స్థలం నుంచి భయంతో ముగ్గురు పరారయ్యారు. కారు మాత్రం లోయలోనే ఉంది. అతివేగమే ప్రమాదానికి
కారణమని స్థానికులు తెలిపారు.
ముగ్గురు పర్యాటకులకు స్వల్ప గాయాలు


