
కార్యదర్శిపై చర్యలకు డిమాండ్
పెదబయలు: మండలంలోని గోమంగి గోమంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి మనోజ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈవోపీఆర్డీ నర్సింగరావుకు ఉప సర్పంచ్ కూడ మత్స్యకొండబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు సత్తిబాబు, టీడీపీ నాయకుడు పురసకారి భాస్కరరావు తదితరులు గురువారం వినతిపత్రం అందజేశారు. గత రెండు నెల నుంచి కార్యదర్శి విధులకు గైర్హాజరమవుతున్నారని అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అతని స్థానంలో మరో కార్యదర్శిని నియమించాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.