
చికెన్‌తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ
అడ్డతీగల: చికెన్‌తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గిరిజన మహిళలకు హీపర్ ఇంటర్నేషనల్,నవజీవన్ సంస్థలు సంయుక్తంగా శిక్షణ ఇచ్చాయి. అడ్డతీగల మండలం రేగులపాడులో సోమన్నపాలెం,రేగులపాడు గ్రామాలకు చెందిన గిరిజన మహిళలకు హీపర్ ఇంటర్నేషనల్ రంపచోడవరం డివిజన్ ప్రాజెక్ట్ అధికారి సునీత గురువారం శిక్షణ ఇచ్చారు. చికెన్ పచ్చడి తయారీ,మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.చికెన్ పచ్చడి తయారు చేసిన తరువాత మూడు నెలల పాటు నిల్వ ఉంటుందన్నారు. సంఘంగా ఏర్పడి బయట ప్రాంతాల్లో మార్కెటింగ్ చేస్తే వ్యాపారం బాగా సాగుతుందన్నారు.