పోరాటాలతోనే ఆదివాసీలకు న్యాయం
చింతూరు: పోరాటాల ఫలితంగానే ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ రంగాల్లో సరైన న్యాయం దక్కుతుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు అన్నారు. పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం చింతూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు రోజునే తమసంఘం ఆవిర్భావ దినోత్సవం జరగడం సంతోషంగా ఉందన్నారు. జీవో నంబర్లు 3, 267తో పాటు ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై నిరంతర పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆదివాసీ యువత పరిషత్ అడుగుజాడల్లో నడుస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఆయన కోరారు. నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా పరిధిలోకి పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయిగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి, కన్నాపురం మండలాలను కలపాలని ఆయన డిమాండ్ చేశా రు. తద్వారా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే ఆస్కారముటుందని ఆయన పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ నాయకులు పూనెం చిన్నవీరభద్రం, కుంజా శ్రీను, పొడియం లక్ష్మణరావు, శంకురమ్మ, ప్రసాద్, భ్రహ్మయ్య, రమణారెడ్డి, రవి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు


