గిరిజనుల ముంగిటకే పాలన
రంపచోడవరం: ఏజెన్సీలో ప్రజలకు వివిధ రకాలైన సేవలు అందించేందుకు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు జరిగిందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో కలెక్టర్ నూతన కార్యాలయాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, ట్రైకార్ చైర్మన్ బి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్రిజ కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలో వెనుకబడిన ప్రాంతంగా రంపచోడవరం నియోజకవర్గాన్ని గుర్తించి 12 మండలాలకు వివిధ రకాలైన సేవలు సకాలంలో అందించే విధంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అల్లూరి జిల్లాలోని పాడేరు రావాలంటే సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుతో ఇబ్బందులు తొలిగాయన్నారు. వైటీసీ, పీఎంఆర్‌సీ నుంచి సేవలందించేలా రెండు భవనాలు ప్రస్తుతం ఉపయోగిస్తున్నామన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం యాథావిధిగా పనిచేస్తుందన్నారు. గుర్తేడు మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత గిరిజనులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. పీవీటీజీ గిరిజనుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయన్నారు. అల్లూరి జిల్లాలో 1570 సెల్ టవర్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. జులై నెలాఖరుకు పూర్తి స్ధాయిలో నెట్‌వర్క్ అందుతుందన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పాటుతో గిరిజనులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. జిల్లాను అభివృద్ధిపఽథంలో నడిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయిప్రశాంత్, ఎస్‌డీసీ అంబేద్కర్, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం కేంద్రంగా
’పోలవరం’ జిల్లా ఆవిర్భావం
కలెక్టర్ దినేష్‌కుమార్
యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో కలెక్టర్ కార్యాలయ ప్రారంభం
గిరిజనుల ముంగిటకే పాలన


