నూతనోత్సాహం
నిన్నటి జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ.. ఆశల పల్లకిలో 2026కు స్వాగతం పలుకుతూ.. మన్యం గుండెల్లో నూతనోత్సాహం ఉప్పొంగింది. కేక్, మిఠాయిల తీపి.. గులాబీల పరిమళం.. మెరిసే అలంకరణలు.. మురిసే చిరునవ్వులు.. వీధులన్నీ పండుగ సంబరంలో మునిగిపోయాయి. కష్టాలన్నీ కరిగిపోవాలని.. సుఖశాంతులు చేకూరాలని.. అందరి ఆకాంక్షలు ఒక్కటై.. ఆశావహ దృక్పథంతో.. గిరిజన ప్రాంతమంతా నూతన కాంతులతో విరాజిల్లింది.
న్యూ ఇయర్ వేడుకలతో సందడి
మత్స్యగెడ్డ ఒడ్డున న్యూఇయర్ వేడుకల్లో పర్యాటకులు
సాక్షి,పాడేరు: న్యూ ఇయర్ వేడుకలతో జిల్లావ్యాప్తంగా ముందస్తు సందడి నెలకొంది. జిల్లా కేంద్రమైన పాడేరులో న్యూ ఇయర్ కేక్‌లు భారీగా అమ్ముడుపోయాయి. పండ్ల దుకాణాల వద్ద సందడి నెలకొంది. గులాబీలు, పూల బొక్కేల కొనుగోళ్లు భారీగా జరిగాయి. మార్కెట్లో న్యూఇయర్ జోష్ నెలకొంది.
● బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. క్రైస్తవ కుటుంబాలు, యువత, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాడేరులోని సెయింట్ ఆన్స్ చర్చితో పాటు అన్ని చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రా ర్థనలు నిర్వ హించారు. దైవ సేవకు లు లోక కల్యాణం కో రుతూ యేసుక్రీస్తుకు ప్రత్యేక ఆరాధనలు చేశా రు. క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనల్లో పాల్గొన్నారు.కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఆకట్టుకున్న ‘ధాన్యపు’ ముగ్గు
కొత్త ఏడాది వేడుకల్లో భా గంగా నివాసాలు, దుకాణాల వద్ద మ హిళలు, యువతులు రంగురంగుల ముగ్గులు వేసి సందడి చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని బూరెడ్డి డిపార్ట్‌మెంటల్ స్టోర్ ఎదుట బూరెడ్డి గాయత్రి వివిధ రకాల పప్పు ధాన్యాలతో వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వినూత్న ముగ్గును అటుగా వెళ్లే బాటసారులు ఆసక్తిగా తిలకించారు.
● అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఆమె భర్త చెట్టి వినయ్ మరియు అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కలిసి కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. సుఖ సంతోషాలు నింపాలని వారు ఆకాక్షించారు.
ముంచంగిపుట్టు: మండలంలో నూతన సంవత్సర వేడుకల సందడి నెలకొంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు మిళితమైన ఈ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించారు. యువత చలిమంటలు, పాటలతో 2026కు ఘనంగా స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో గ్రామాలు కళకళలాడాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడంతో పండగ వాతావరణం నెలకొంది. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
నూతనోత్సాహం
నూతనోత్సాహం
నూతనోత్సాహం
నూతనోత్సాహం


