
362 కిలోల గంజాయి స్వాధీనం
● జీపు సీజ్, ఒకరి అరెస్ట్
పాడేరు : గుత్తులపుట్టు–పెదబయలు మార్గంలో పాడేరు ఎకై ్సజ్ సిబ్బంది ఓ జీపులోంచి 362 కిలోల ఎండు గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పాడేరు ఎకై ్సజ్ సీఐ టి.వి.వి.ఎస్.ఎన్. ఆచారి తెలిపిన వివరాలిలా ఉన్నాయి...ముందస్తు సమాచారం మేరకు గుత్తులపుట్టు–పెదబయలు మార్గంలో ఎకై ్సజ్ సిబ్బంది పెట్రోలింగ్ చేశారు. ఆ సమయంలో వచ్చిన జీపును ఆపగా, అందులో ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి పరారయ్యాడు. జీపులో ఉన్న కిముడు దివాకర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, విచారించినట్టు ఎకై ్సజ్ సీఐ చెప్పారు. పరారైన వ్యక్తి పెదబయలు మండలం అరడకోట గ్రామానికి చెందిన కిముడు అనిల్ అని తెలిసిందన్నారు. భోగంపుట్టు గ్రామానికి చెందిన అల్లంగి భగవాన్ అనే వ్యక్తి నుంచి గంజాయి తీసుకొని వస్తుండగా కిముడు అనిల్ పారిపోయాడన్నారు. గంజాయి తరలించేందుకు వినియోగించిన జీపు వంతాల ప్రభాకర్‌దిగా తేలిందన్నారు. 362 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని జీపును సీజ్ చేశామన్నారు. ఈ గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న, పరారీలో ఉన్న వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్ టాస్క్‌పోర్స్ సీఐలు బాల నరసింహ, భాను సత్యనారాయణ, సిబ్బంది తాతయ్య, రాజ్‌కుమార్, పూర్ణ చంద్రరావు, బాలమురళి పాల్గొన్నారు.