450 మందికి వైద్య పరీక్షలు
డుంబ్రిగుడ: మండలంలోని కొర్ర పంచాయతీ కేంద్రంలో భారత మానవ హక్కుల సంరక్షణ సంస్ధ (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్ రాజన్‌ప్రసాద్ రావు ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు, బీపీ, షుగర్ తనిఖీలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా 42 మంది కంటి పరీక్షలు చేసుకోగా 15 మందిని మెరుగైన చికిత్సలు, సర్జరీ కోసం సిఫార్సులు చేశారు. కొర్ర పంచాయతీతో పాటు సమీప గ్రామాల నుంచి సుమారు 450 మందికి వైద్య పరీక్షలు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ట్రెడ్స్, ఆశ ఫౌండేషన్ ఎన్‌జీవోల సహకారంతో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వృద్దులకు రగ్గులు, దుస్తులు పంపిణీ చేశారు. ట్రెడ్స్ సంస్ధ డైరెక్టర్ వెంకటరావు, ఆవ ఫౌండేష్ సీఈవో ప్రసాద్‌రావు, సీఐఎస్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఐషత, సంధ్య, నిర్మలదేవి, తదితరులు పాల్గొన్నారు.


