ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
● ఎమ్మెల్యే శిరీషపై పోలీసులకు
వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
● రాజవొమ్మంగిలో ఫిర్యాదు స్వీకరించని
పోలీసులు
ఎటపాక , వి.ఆర్.పురం, కూనవరం పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదుచేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,
ఎటపాక/కూనవరం/వి.ఆర్.పురం/గంగవరం/రాజవొమ్మంగి: ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అనంతబాబుపై తప్పుడు ఆరోపణులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శీరిషాపై ఎటపాక, వి.ఆర్.పురం, కూనవరం, గంగవరం, రాజవొమ్మంగి తదితర మండలాల్లోని పోలీసు స్టేషన్‌లలో వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నియోజక ప్రజలకు అండగా నిలిచి, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీపై అసత్య ప్రచారాలు మానుకుని ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎటపాకలో పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు,రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకట్,ఎంపీటీసీలు వెంకట్రామిరెడ్డి,అంజలి,నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు దామెర్ల రేవతి,మండల అధ్యక్షురాలు నాగలక్ష్మి, అవులూరి సత్యనారాయణ, తోట శశికుమార్, దయాకర్, నవీన్‌బాబు, కోటి, సర్పంచ్ నాగమణి, కన్నా, రాజశేఖర్, మణి, స్వరూప తదితరులున్నారు. వి.ఆర్.పురంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు బోడ్డు సత్యనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిక్కాల బాలకృష్ణ, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చీమల కాంతారావు, ఆర్టీఐ ప్రతినిధి జయరాజు, నరేష్, రమేష్ సత్య తదితరులున్నారు. కూనవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆలూరి కోటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గుజ్జా విజయ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల మరియాదాస్, ఎస్టీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు గుజ్జాబాబు, మాజీ డైరెక్టర్ దీకొండ గంగాధర్, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షుడు నోముల కొండలరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవా దివాకర్, మహిళా ఉపాధ్యక్షురాలు కొమ్మాని సునీత, ఇంటి పూర్ణానందం, సర్పంచ్‌లు నూపా వెంకన్నబాబు, నిరోషా, మడకం పూర్ణ, నోముల సత్యనారాయణ, సత్తిపండు, మధు, లక్ష్మణ్, వీర్రాజు తదితరులున్నారు. గంగవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన వారిలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు , మండల ఇన్‌చార్జి సీహెచ్.రఘునాఽథ్, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కె.రామతులసి, కె.గంగాదేవి , ఎంపీటీసీ సభ్యులు కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, సర్పంచ్‌లు కామరాజుదొర, మరిడమ్మ, వెంకటేశ్వర్లుదొర, నాయకులు శివ , బాబి, రామకృష్ణ, జగదీష్, సతీష్, శ్రీను తదితరులున్నారు. రాజవొమ్మంగిలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదును స్థానిక పోలీసులు స్వీకరించలేదని మండల పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కొంగర మురళి కృష్ణ చెప్పారు.
ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు


